సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పుట్టిన రోజు సందర్భంగా మున్సిపల్ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న కార్మికులకు సరకులు, గుడ్లు అందించారు.
కార్మికులకు నిత్యావసరాలు వితరణ చేసిన మాజీ ఎమ్మెల్యే - సంగారెడ్డి జిల్లా ఈరోజు వార్తలు
లాక్డౌన్తో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కూలీలు, కార్మిక కుటుంబాలకు దాతలు నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మున్సిపల్ కార్మికులకు సరకులు, గుడ్లు వితరణ చేశారు.
కార్మికులకు నిత్యావసరాలు వితరణ చేసిన మాజీ ఎమ్మెల్యే
లాక్డౌన్ ముగిసే వరకు ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మాస్క్‌లు లేవు... ఆరోగ్య పరీక్షలు కానరావు