తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని... సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. ఇలాంటి అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగడం లేదని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలోని 17వ వార్డులోని హస్టల్‌గడ్డ, చింతల్‌పల్లిలో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయన సమక్షంలో తెరాసలో చేరారు.
సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నాయి: చింతా ప్రభాకర్ - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు నేరుగా ప్రజల్లోకి వెళుతున్నాయని... సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. అందుకే ప్రజలు తెరాసకు అధికారాన్ని కట్టబెట్టారని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని హస్టల్‌గడ్డ, చింతల్‌పల్లిలో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
![సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నాయి: చింతా ప్రభాకర్ former MLA Chinta Prabhakar meeting in Sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10759679-105-10759679-1614169086059.jpg)
సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నాయి: చింతా ప్రభాకర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు నేరుగా ప్రజల్లోకి వెళుతున్నాయని... అందుకే తెరాసకు అధికారాన్ని కట్టబెట్టారని ఆయన తెలిపారు. సుమారు వంద మంది పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజలందరికీ అండగా ఉంటామని చెప్పారు.
ఇదీ చదవండి: తెరాసకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి