సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దామర్గిద్ద గ్రామంలో విద్యుత్ షాక్తో రైతు మృతి చెందాడు. చెరుకు తోటకు రక్షణగా నాగేందర్ అనే రైతు ఏర్పాటు చేసుకున్న కంచెకు విద్యుత్ ప్రవాహం ఉన్నదని తెలియక.. బాన్సువాడ గ్రామానికి చెందిన సాయిలు అనే రైతు ఆ మార్గంలో వెళ్తూ కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు వదిలాడు.
కరెంట్ షాక్తో రైతు మృతి - సంగారెడ్డి వార్తలు
చెరుకు చేనుకు వేసిన విద్యుత్ కంచె షాక్ కొట్టడం వల్ల రైతు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలో చోటు చేసుకుంది. చెరుకు తోటకు రక్షణగా వేసుకున్న కంచెకు.. విద్యుత్ సరఫరా ఉన్నదని తెలియక ఆ మార్గంలో వెళ్తూ.. కరెంట్ షాక్తో రైతు మృతి చెందాడు.
కరెంట్ షాక్తో రైతు మృతి
పొలానికి వెళ్లిన సాయిలు చీకటి పడినా.. ఇంటికి రాకపోవడం వల్ల కంగారు పడిన కుటుంబ సభ్యులు గ్రామంలో వాకబు చేయగా.. కొద్దిసేపటి క్రితమే కరెంట్ షాక్తో మరణించాడని తెలిసి కన్నీరు మున్నీరయ్యారు. మృతుడి భార్య అంజవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం