తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేటు పెట్టుబడుల కోసం... కార్మిక చట్టాల సరళీకృతం'

మోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను సరళీకృతం చేయడాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో బీఎంఎస్ మినహా మిగిలిన కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున బైక్​ ర్యాలీ చేశారు. ప్రైవేటు పెట్టుబడులకు అవరోధం కల్గిస్తున్నాయనే సరళీకృతం చేస్తున్నారని కార్మిక నాయకులు ఆరోపించారు.

For private investment simplified labor laws in central government
ప్రైవేటు పెట్టుబడుల కోసం... కార్మిక చట్టాల సరళీకృతం?

By

Published : Jan 8, 2020, 1:29 PM IST

కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను సరళీకృతం చేయడాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో కార్మిక సంఘాలు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి పోతిరెడ్డి పల్లి చౌరస్తా వరకు చేపట్టిన ఈ ర్యాలీలో బీఎంఎస్ తప్ప మిగిలిన అన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రధాని మోదీ ప్రైవేటు యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారని.. వారి కోసమే కార్మిక చట్టాలను వేగంగా సరళీకృతం చేస్తున్నారని చుక్క రాములు ఆరోపించారు. 44 చట్టాలను సరళీకృతం చేసి నాలుగు లేబర్ కోడ్​లుగా చేయడం వల్ల చట్టాల తీవ్రతను తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ఎన్నికల్లో ఒక మాట, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారన్నారు. కార్మిక చట్టాల పరిరక్షణ కొరకు 1991నుంచి అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడటం అభినందనీయమన్నారు.

ప్రైవేటు పెట్టుబడుల కోసం... కార్మిక చట్టాల సరళీకృతం?

ఇదీ చూడండి : 'నీరే ఇవ్వలేదు... ఓట్లు ఎలా అడుగుతరు'

ABOUT THE AUTHOR

...view details