తెలంగాణ

telangana

ETV Bharat / state

జహీరాబాద్​లో కలుషిత ఆహారం తిని 17 మందికి అస్వస్థత.. అసలు ఏం జరిగింది? - Sangareddy district latest news

food poison in a hotel at Zaheerabad
food poison in a hotel at Zaheerabad

By

Published : Dec 10, 2022, 2:00 PM IST

Updated : Dec 10, 2022, 3:07 PM IST

13:55 December 10

జహీరాబాద్​లో కలుషిత ఆహారం తిని 17 మందికి అస్వస్థత..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఓ బిర్యాని హోటల్​లో కలుషిత ఆహారం తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి హోటల్​లో మండి చికెన్, మటన్ బిర్యాని తినడంతో వాంతులు, విరేచనాలతో స్థానిక వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రిలో బాధితులను చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబీకులు హైదరాబాద్​లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కలుషిత ఆహారం తిన్న బాధితుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

ఈ ఘటన విషయం తెలియడంతో జహీరాబాద్​ పట్టణ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని.. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. హోటల్ నిర్వాహకులు కలుషిత ఆహారం ఇవ్వడంతోనే వాంతులు, విరోచనాలు అయి అస్వస్థతకు కారణం అయ్యాయని బాధితుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శేషురావు తెలిపారు.

ఇవీ చదవండి:TS Cabinet Meeting : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

గుజరాత్​ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్.. ఎమ్మెల్యేల ఏకగ్రీవ​ ఎన్నిక..!

Last Updated : Dec 10, 2022, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details