లాక్‌డౌన్ వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులు బంధువులు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారని జిల్లా సెషన్ న్యాయవాది పాపిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 100 మందికి ఆహారం అందించారు.
ప్రభుత్వాసుపత్రిలో రోగులకు, బంధువులకు అన్నదానం
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జిల్లా సెషన్ న్యాయవాది పాపిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు వందమందికి భోజనం అందించారు.
ప్రభుత్వాసుపత్రిలో అన్నదానం
లాక్‌డౌన్ వల్ల తినడానికి బయట ఏమీ దొరకడం లేదని... అందువల్లనే అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు భోజనం అందిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతోన్న లాక్‌డౌన్