సంగారెడ్డిలోని పాత బస్టాండ్ ఆవరణలో అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదల ఆకలిని తీర్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
సంగారెడ్డిలో పేదలకు అన్నదానం - Sangareddy Lockdown Annadanam
లాక్డౌన్ వల్ల ఆకలితో అలమటిస్తున్న పేదలకు సంగారెడ్డిలో అన్నదానం చేశారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

సంగారెడ్డిలో అన్నదానం
32 రోజులుగా ఈ అన్నదానాన్ని చేస్తున్నామన్నారు. లాక్డౌన్ను దృష్టిలో ఉంచుకొని మరిన్ని రోజులు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు.