కార్పొరేట్ పాఠశాలల దీటుగా ప్రభుత్వ బడుల విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు 'ఫోకస్' పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యాశాఖ, జిల్లా సైన్స్ కేంద్రం పర్యవేక్షణలో ప్రభుత్వ బడుల నుంచి వంద మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ డివిజన్లలోని మూడు కేంద్రాల్లో శుక్రవారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి సంగారెడ్డిలోని సైన్స్ కేంద్రంలో తరగతులు నిర్వహిస్తారు. గురుకులాల తరహాలో ఏడాదిపాటు శిక్షణ ఇస్తామని సైన్స్ కేంద్రం ఇంఛార్జ్ విజయ్‌కుమార్ తెలిపారు.
ఉత్తమ విద్యార్థులపై కలెక్టర్ 'ఫోకస్' - సంగారెడ్డి కలెక్టర్
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దేందుకు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు నడుం బిగించారు. ఫోకస్ పేరిట సుమారు 100 మంది విద్యార్థులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
ఉత్తమ విద్యార్థులపై కలెక్టర్ 'ఫోకస్'