తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరదసాయం పేరుతో చాలా మందిని దోచుకున్నారు' - bjym leaders protest in patancheru

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ముందు బీజేవైఎం నాయకులు వరదబాధితులు అందోళన నిర్వహించారు. వెంటనే తమని ఆదుకోవాలని... లేనిపక్షంలో గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ముందే వండుకుని తింటామని... ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

'వరదసాయం పేరుతో చాలా మందిని దోచుకున్నారు'
'వరదసాయం పేరుతో చాలా మందిని దోచుకున్నారు'

By

Published : Oct 31, 2020, 5:35 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ముందు బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో వరద బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వరద బాధితులు నిరసన వ్యక్తం చేశారు. వరదసాయం పేరుతో చాలా మందిని దోచుకున్నారని బీజేవైఎం నాయకులు ఆశిశ్​గౌడ్ ఆరోపించారు.

అసలైన బాధితులకు నగదు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గ్రేటర్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే తమని ఆదుకోవాలని... లేనిపక్షంలో గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ముందే వండుకుని తింటామని... ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: అడ్డగుట్ట కార్పొరేటర్ ఇంటిని ముట్టడించిన ముంపు బాధితులు

ABOUT THE AUTHOR

...view details