తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద - etv bharath

సింగూరు ప్రాజెక్టుకు పై నుంచి వరద కొనసాగుతోంది. దాదాపు 54 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. రెండు రోజుల క్రితం 4 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ రెండు రోజుల్లో 13 టీఎంసీలకు చేరింది.

flood coming to singuru project in sangareddy district
సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

By

Published : Sep 18, 2020, 1:06 PM IST

ఉమ్మడి మెదక్ జిల్లాలో మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దాదాపు 54 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. రెండు రోజుల క్రితం 4 టీఎంసీలు ఉన్న ప్రాజెక్టు నీటి నిల్వ రెండు రోజుల్లో 13 టీఎంసీలకు చేరింది. మూడేళ్ల తర్వాత జలాశయం నిండడంపై రైతులు ఆనందం వ్యక్తే చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాతోపాటు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మంజీరా నదికి భారీ వరద నీరు వస్తోంది. ఈ నది సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని జనవాడ వద్ద తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 96 కిలోమీటర్లు ప్రవహించి నిజామాబాద్ జిల్లాలో గోదావరిలో కలుస్తుంది.

ఇదీ చదవండి:'రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలే లేవు'

ABOUT THE AUTHOR

...view details