చేతికి అందుతాయనుకున్న దశలో చెరువులో ఉన్న చేపలన్నీ మృత్యువాత పడి మత్స్యకారుడికి తీవ్ర నష్టాన్ని తెచ్చాయి. సంగారెడ్డి జిల్లా గౌడి చర్ల గ్రామానికి చెందిన చిన్న కృష్ణ అనే వ్యక్తి.... ఊర్లో ఉన్న చెరువును వేలంలో దక్కించుకున్నాడు. అప్పు చేసి మరీ 95 వేల రూపాయలు చెల్లించాడు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టానని, చేపలన్నీ చనిపోవడంతో తనకు ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన చెందుతున్నాడు.
Fishes Died: చేతికందే దశలో చెరువులోని చేపలన్నీ..! - చెరువులో చేపలు మృతి
కొన్ని రోజులు ఆగితే అతని పడిన కష్టానికి ప్రతిఫలం వస్తుందని భావించాడు. అప్పు చేసి మరీ వేలంపాటలో చెరువును దక్కించుకున్నాడు. దాదాపు లక్షా 20 వేల చేప పిల్లలను నీటిలో వదిలాడు. తీరా చేతికందే సమయంలో చేపలన్నీ మృత్యువాత పడ్డాయి. దీంతో సంగారెడ్డి జిల్లా గౌడిచర్ల గ్రాామానికి చెందిన కృష్ణ అనే మత్స్యకారుడు ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపించాడు.
చెరువులో ఉన్న చేపలన్నీ మృత్యువాత
సొసైటీ వేసిన 80 వేల చేప పిల్లలకు అదనంగా... అదనంగా తాను కైకలూరు నుంచి 40 వేల పిల్లలు కొనుగోలు చేసి చెరువులో వదిలాడు. ప్రస్తుతం ఈ చేపలు మంచి బరువు పెరిగాయి. కొన్ని రోజులు ఆగితే అమ్ముకోవచ్చని కృష్ణ భావించారు. కానీ రెండు రోజులుగా చెరువులో ఉన్న చేపలన్నీ చనిపోవడంతో ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.