తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి మెదక్ జిల్లాలో 261 మంది వ్యాక్సిన్ పంపిణీ - సంగారెడ్డి జిల్లాలో మొదటి రోజు వ్యాక్సిన్ పంపిణీ

దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించగా... ఉమ్మడి మెదక్ జిల్లాలో 261 మంది టీకా వేయించుకున్నారు. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటిరోజు కేటాయించిన 30 మంది టీకా తీసుకోగా... సిద్దిపేటలో కేవలం 11 మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు.

first day vaccine distribution in sangareddy district
ఉమ్మడి మెదక్ జిల్లాలో 261 మంది వ్యాక్సిన్ పంపిణీ

By

Published : Jan 17, 2021, 5:51 AM IST

ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి రోజు 261మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. గరిష్ఠంగా మెదక్ జిల్లా ఆసుపత్రిలో 30మంది వేయించుకోగా, అత్యల్పంగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కేవలం 11మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. 69 మంది వివిధ కారణాలతో వ్యాక్సిన్ వేయించుకోలేదు.

సంగారెడ్డి

ఇందిరా కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేద్రంలో 24మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మొదటి టీకాను ఇదే ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తించే సుకన్యకు ఇచ్చారు.

పటాన్​చెరు

పటాన్​చెరు ప్రాంతీయ ఆసుపత్రిలో 17మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్​గా పనిచేసే కొండల్​కు మొదటి టీకా వేశారు.

జోగిపేట

జోగిపేట ప్రాంతీయ ఆసుపత్రిలో 29మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇదే ఆసుపత్రిలో డార్క్ రూం అసిస్టెంటుగా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజు మొదటి టీకా వేయించుకున్నారు. స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మి ఆందోళనకు గురవడంతో నాగరాజుకు మొదటి అవకాశం వచ్చింది. అనంతరం లక్ష్మీ సైతం వ్యాక్సిన్ వేయించుకున్నారు.

దిగ్వాల్

దిగ్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 26 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇదే ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుడు రాజు కుమార్ మొదటి టీకా వేయించుకున్నారు.

జహీరాబాద్

జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిలో 22మంది టీకా వేయించుకున్నారు. ఈ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఎలిజబెత్​కు మొదటి వ్యాక్సిన్ వేశారు.

ఝరాసంఘం

ఝరాసంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 29మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక్కడే వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న మాజిద్ మొదటి టీకా వేయించుకున్నారు.

మెదక్

మెదక్ జిల్లా ఆసుపత్రిలో 30మంది టీకా వేయించుకున్నారు. మొదటి రోజు కేటాయించిన వారందరూ హజరవడం విశేషం. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్ రావు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

నర్సాపూర్

నర్సాపూర్ ప్రాంతీయ ఆసుపత్రిలో 18మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇదే ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ విభాగంలో సేవలు అందిస్తున్న వైద్యుడు గురుకృష్ణ మొదటి టీకా వేయించుకున్నారు.

సిద్దిపేట

సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కేవలం 11మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. సిద్దిపేట వైద్య కళాశాలలో సహయ ఆచార్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న స్మిత మొదటి టీకా వేయించుకున్నారు.

నంగునూర్

నంగునూర్ ఆరోగ్య కేంద్రంలో 29మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్న సంపత్​కు మొదటి టీకా వేశారు.

గజ్వేల్

గజ్వేల్​లోని జిల్లా ఆసుపత్రిలో 26మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ ఆసుపత్రిలో డయాలసిస్ విభాగంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వర్తిస్తున్న కీర్తనకు మొదటి టీకా వేశారు.

ఇదీ చూడండి:వ్యాక్సినేషన్ సక్సెస్... కిష్టమ్మకు తొలిటీకా

For All Latest Updates

TAGGED:

sangareddy

ABOUT THE AUTHOR

...view details