సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ సమీపంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై గత అర్ధరాత్రి ఓ కారు ఇంజన్లో మంటలు చెలరేగి, పూర్తిగా దగ్ధమయ్యింది. డ్రైవర్ అప్రమత్తతతో కారులోని నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేశారు.
ఇంజిన్‌లో మంటలు..నడిరోడ్డుపై కారు దగ్ధం.. - సత్వార్‌లో కారులో చెలరేగిన మంటలు వార్తలు
కారు ఇంజన్లో మంటలు చెలరేగి, కారు దగ్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లా సత్వార్ సమీపంలోని 65వ నెంబరు జాతీయ రహదారిపై గత అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఇంజిన్‌లో మంటలు..నడిరోడ్డుపై కారు దగ్ధం..
మహారాష్ట్రకు చెందిన ప్రయాణికులు హైదరాబాద్ నుంచి షోలాపూర్ వెళ్తుండగా సత్వార్ సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్ కారును నిలిపివేశాడు. ఇంజన్‌ను పరిశీలిస్తుండగా... ఒక్కసారిగా మంటలు వ్యాపించి నిమిషాల్లోనే కారు దగ్ధమైపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న చిరాగ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : హైదరాబాద్ విశ్వవిద్యాలయాలల్లో "పౌర" సెగలు