శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కంది మండలం మక్తా అల్లూర్లోని సంగమేశ్వర ఆలయంలో గురువారం రాత్రి భజనలు చేశారు. అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. స్థానిక హనుమాన్ మందిరం నుంచి సంగమేశ్వర ఆలయ ప్రాంగణంలోకి పుర వీధుల గుండా భజనలు, దండకాలు వేస్తూ ఆలయానికి వచ్చారు.
సంగమేశ్వర ఆలయంలో అగ్నిగుండాలు.. భక్తుల మొక్కులు - sangareddy district latest news
మహాశివరాత్రి వేళ సంగారెడ్డి జిల్లా కంది మండలం మక్తా అల్లూర్లోని సంగమేశ్వర ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామస్థులు అగ్నిగుండాల మీదుగా వెళ్లి తమ మొక్కులు తీర్చుకున్నారు.
![సంగమేశ్వర ఆలయంలో అగ్నిగుండాలు.. భక్తుల మొక్కులు Fire pits in Sangameshwara temple in sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10974411-649-10974411-1615521452650.jpg)
సంగమేశ్వర ఆలయంలో అగ్నిగుండాలు.. భక్తుల మొక్కులు
కార్యక్రమంలో భాగంగా మహిళలు మంగళ హారతులతో ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అగ్ని గుండాల మీదుగా వెళ్లి తమ తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.