తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సులో మంటలు... ప్రయాణికులు సురక్షితం

ఇంజిన్​లో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముంబయి నుంచి హైదరాబాద్​ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మంటలు చెలరేగి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
మంటలు చెలరేగి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం

By

Published : Mar 13, 2020, 8:24 AM IST

Updated : Mar 13, 2020, 9:26 AM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ప్రైవేటు ట్రావెల్స్​ బస్సు దగ్ధమైంది. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను దింపేయగా ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలాన్ని చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అకస్మాత్తుగా ఇంజిన్​లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.

ట్రావెల్స్ బస్సు ముంబయి నుంచి హైదరాబాద్​ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉండగా... వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. సామగ్రి మొత్తం దగ్ధమైంది.

మంటలు చెలరేగి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం

ఇవీ చూడండి:పేదోడి ఇంటి కలను నెరవేర్చే పనిలో సర్కారు

Last Updated : Mar 13, 2020, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details