Fire Accident In Sangareddy: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని అమర్‌ల్యాబ్ రసాయన పరిశ్రమలో రెండు రియాక్టర్‌లు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిని బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Fire Accident at RTC Bus in Korutla : డిపోలో ఆపిన బస్సులో మంటలు.. శుభ్రం చేస్తుండగా ప్రమాదం
బొల్లారం పారిశ్రామికవాడలోని అమర్‌ల్యాబ్ రసాయన పరిశ్రమలో రెండు రియాక్టర్‌లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద సమయంలో కంపెనీలో చాలా మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో భారీ శబ్దం వచ్చింది. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఈ సమయంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. దీనిలో 11 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత చుట్టుపక్కల కిలో మీటరు వరకూ పొగలు అలముకున్నాయి. పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ అమర్ ల్యాబ్ పరిశ్రమలో గతంలో కూడా ఇటువంటి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.