సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న మెట్ట పంటల పరిశోధనా సంస్థ ఇక్రిశాట్ క్షేత్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగల రాపిడికి నిప్పురవ్వలు పడి ఎండిపోయిన కంకిచొప్ప తగలబడింది. మంటలు ఉవ్వెత్తున పైకి లేచాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కూరుకుపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే గమనించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనతో ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఇక్రిశాట్ వర్గాలు తెలిపాయి.
పటాన్ చెరు ఇక్రిశాట్లో అగ్ని ప్రమాదం... - మంటలను అదుపులోకి తెచ్చిన అగ్ని మాపకత సిబ్బంది
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇక్రిశాట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
సకాలంలో మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
TAGGED:
Fire accident