తెలంగాణ

telangana

ETV Bharat / state

టైర్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం - సంగారెడ్డి జిల్లా వార్తలు

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి శివారులోని టైర్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ముడి సరకుకు మంటలు అంటుకోవడమే ప్రమాదానికి కారణమని యాజమాన్యం తెలిపింది.

టైర్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం
టైర్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం

By

Published : Jul 1, 2020, 10:13 PM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి శివారులోని టైర్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముడిసరుకు మంటలు తాకడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ప్రమాదం జరగగానే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినా సమయానికి రాలేదని .. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది.

టైర్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details