తెలంగాణ

telangana

ETV Bharat / state

రబ్బరు పరిశ్రమలో అగ్నిప్రమాదం - rubber factory

సంగారెడ్డి జిల్లా శారదా సెల్​టెక్ రబ్బరు పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.

రబ్బరు పరిశ్రమలో అగ్నిప్రమాదం

By

Published : Apr 20, 2019, 6:59 PM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ఎదురుగూడెంలో శారద సెల్​టెక్ రబ్బరు పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. రబ్బరు పరిశ్రమకి వినియోగించే ఆయిల్ ట్యాంక్ ఓవర్​లోడ్ కావడం వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అగ్నిప్రమాదంలో రబ్బరు పదార్థాలు దగ్ధం కావటం వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

రబ్బరు పరిశ్రమలో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details