సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు సమీపంలో... రసాయనాలు నిల్వ ఉంచిన గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బొంతపల్లి పారిశ్రామికవాడలో ఉన్న గోదాములో మొదట మంటలు చెలరేగగా... అందులోని రసాయన డ్రమ్ములు పేలి క్షణాల్లోనే మంటలు విస్తరించాయి. మొత్తం ఏడు అగ్నిమాపక యంత్రాల సాయంతో సిబ్బంది ఉదయం నాలుగు గంటల సమయంలో మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.
రసాయనాల గోదాములో భారీ అగ్ని ప్రమాదం - సంగారెడ్డిలో అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో రసాయనాల నిల్వ ఉంచే గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలోని రసాయనాల డ్రమ్ములకు నిప్పు అంటుకోగా.. మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
రసాయనాల నిల్వ గోదాములో అగ్నిప్రమాదం..
ప్రమాద సమయంలో గోదాములో ఉన్న నలుగురు బయటకు పరుగులు తీయగా... ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. అగ్నిప్రమాదం కారణంగా దట్టమైన పొగలు మూడు కిలోమీటర్లు మేర కమ్మేయగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఇవీచూడండి:ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?
Last Updated : Aug 23, 2020, 9:12 AM IST