సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని నాలుగు దుకాణాలు దగ్ధమయ్యాయి. పట్టణంలోని ఫ్యామిలీ దాబా పరిసరాల్లోని రెగ్జిన్, రేడియం, వెల్డింగ్ దుకాణాలు, మెకానిక్ వర్క్ షాప్ కాలి బూడిదయ్యాయి. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా రెగ్జిన్ దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనున్న దుకాణాలకు వ్యాపించటం వల్ల ప్రమాద తీవ్రత అధికమయింది. సుమారు రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగుంటుందని బాధిత వ్యాపారులు అంచనా వేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఘోర అగ్నిప్రమాదం... నాలుగు దుకాణాలు దగ్ధం - FIRE ACCIDENT AT JAHEERABAD
విద్యుదాఘాతం జరిగి వరుసగా ఉన్న నాలుగు దుకాణాలు మంటలకు ఆహుతయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈ ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
FIRE ACCIDENT AND 4 FOUR SHOPS BURNTS