సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈద్గాలో ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. దేశంలో అడవులను కాపాడుకోకుంటే రాబోయే ఐదేళ్లలో మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని గుర్తు చేశారు.
మొక్కలు పెట్టడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులే కాకుండా సమస్త మానవాళి హరితహారంలో పాల్గొనాలన్నారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటాలని సూచించారు. రైతులు కూడా పొలాల గట్లపై హరితహారంలో మొక్కలు పెంచే ప్రయత్నం చేయాలని కోరారు.