రైతుబంధు సాయం అందించడంలో కేసీఆర్ సర్కారు దేశంలోనే రికార్డు సాధించిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో... ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి పర్యటించారు. రైతు వేదిక భవనాలకు శంకుస్థాపన చేసి, హరితహారంలో మొక్కలు నాటారు.
రైతుబంధు సాయం దేశంలోనే రికార్డు: మంత్రి హరీశ్‌రావు - మునిపల్లిలో హరీశ్ రావు పర్యటన
సంగారెడ్డి జిల్లా మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికలకు శంకుస్థాపనలు చేసి, హరిహారంలో మొక్కలు నాటారు.

రైతుబంధు సాయం దేశంలోనే రికార్డు: హరీశ్
మూడు రోజుల్లోనే 56 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,183 వేల కోట్లు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నియంత్రిత సాగు విధానంలో భాగంగా వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మిస్తున్నామని తెలిపారు. సభలు, సమావేశాలు, ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల సరఫరా వంటి బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేలా వీటిని తీర్చిదిద్దుతామని చెప్పారు.
రైతుబంధు సాయం దేశంలోనే రికార్డు: హరీశ్
ఇదీ చూడండి:కరోనా సోకిందా? అయితే ఈ నగదు బహుమానం మీకే!