Harish Rao on BJP: వరద బాధితులకు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఓట్లకోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాళ్లని సంక్షేమ పథకాలతో ఆదుకోకూడదా అంటు విమర్శించారు. దేశంలో రూ.2 వేల పెన్షన్‌ని సీఎం కేసీఆర్ మాత్రమే అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లాకేంద్రంలో రూ.50 కోట్ల నిధులతో మంజూరైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
వచ్చే 2 నెలల్లో కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తాం. స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పేదలకు ఆర్థికసాయం చేస్తాం. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇక్కడున్నంత అభివృద్ధి లేదు. గోదావరికి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. ముంపు ప్రాంతాల్లో ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడాం.- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి