తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రీకొడుకుల ఘర్షణ

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామికవాడలోని ప్రైవేటు పరిశ్రమలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిశ్రమలోని యంత్ర సామగ్రిని యజమాని కుమారుడు పూర్ణచందర్ తరలించేందుకు ప్రయత్నించడం.. తండ్రి అడ్డుచెప్పడంతో వివాదం మొదలైంది. పరస్పర ఫిర్యాదులతో పటాన్​చెరు ఠాణాలో కేసులు నమోదయ్యాయి.

తండ్రీకొడుకుల ఘర్షణ

By

Published : Feb 13, 2019, 1:39 PM IST

తండ్రీకొడుకుల ఘర్షణ
సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.ఫ్యాక్టరీ యజమాని వెంకటేశ్వరరావు, అతని కుమారుడు పూర్ణచంద్​ల మధ్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది. కంపెనీకి సంబంధించిన ఖాతా నుంచి పూర్ణచందర్​ అధిక మొత్తంలో నగదు తీసుకున్నాడని వెంకటేశ్వరరావు పరిశ్రమలోకి అనుమతి నిరాకరించారు. న్యాయస్థానం అనుమతి ఉందంటూ పూర్ణచందర్​ ఫ్యాక్టరీలోని యంత్ర సామగ్రిని తరలించేందుకు విఫలయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారినందున పోలీసులు రంగం ప్రవేశం చేశారు. పరస్పర ఫిర్యాదులతో పటాన్​చెరు ఠాణాలో కేసులు నమోదుచేశారు.
పూర్ణచందర్​ నుంచి తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని వెంకటేశ్వరరావు భార్య భద్రమ్మ పోలీసులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details