సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నాకు దిగారు. 14 ఏళ్లుగా పనిచేస్తున్నా వేతనాలు విషయంలో సరైన న్యాయం జరగట్లేదని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా