అన్నదాతలను ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం రాయితీ విత్తనాలను పంపిణీ చేస్తోందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో రాయితీపై జనుము, జిలుగు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. జనుము, జీలుగ విత్తనాలతో పచ్చిరొట్ట ఎరువులు చేసుకుని భూసారాన్ని పెంచుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు.
రాయితీ విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Zaheerabad MLA Manikrao
రైతులను ఆదుకునేందుకు తెరాస ప్రభుత్వం రాయితీ విత్తనాలను అందజేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో రాయితీపై జనుము, జిలుగు విత్తనాలను ఈ సందర్భంగా రైతులకు పంపిణీ చేశారు.
రాయితీ విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
40 కేజీల జనము విత్తనాల ధర రూ.930, జీలుగు విత్తనాల ధర రూ.562గా నిర్వహించడం జరిగిందని వ్యవసాయ అధికారిని ప్రవీణ తెలిపారు. రాయితీ విత్తనాలు అవసరమైన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రైతు సేవా కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ విజయ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రదీప్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.