సంగారెడ్డి జిల్లా కోహీర్ తహసీల్దార్ కార్యాలయానికి పాస్ పుస్తకం కోసం వచ్చిన రైతు గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. మనియార్‌పల్లి తండాకు చెందిన 50ఏళ్ల తుల్జానాయక్ భూమికి సంబంధించిన పట్టాదారు పుస్తకం కోసం కొన్నాళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. బుధవారం వచ్చి అధికారులతో పాసు పుస్తకం వివరాలు మాట్లాడుతూనే హఠాన్మరణం చెందాడు. భూమి దక్కదన్న ఆందోళనతోనే కుప్పకూలి మృతిచెందాడని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో గుండెపోటుతో రైతు మృతి - సంగారెడ్డి జిల్లా కోహీర్ తహసీల్దార్ కార్యాలయానికి పాస్ పుస్తకం కోసం వచ్చిన రైతు గుండెపోటుతో కుప్పకూలి మృతి
ఎప్పటిలాగే పాస్ పుస్తకం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు.. కానీ తిరిగి రాలేదు. గుండెపోటుతో అక్కడే కూప్పకూలిపోయాడు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేటుకుంది.

తహసీల్దార్ కార్యాలయంలో గుండెపోటుతో రైతు మృతి
Last Updated : Oct 17, 2019, 10:11 AM IST