విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బాచేపల్లిలో మరో రైతు బలయ్యారు. గ్రామానికి చెందిన రైతు ఉప్పరి మల్లేశం పొలంలో ఉన్న బోరుబావి ప్రారంభించారు. బోర్డులో విద్యుత్ సరఫరా లేదని గమనించిన రైతు... సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ తీగ సరిచేస్తుండగా విద్యుదాఘాతమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
విద్యుత్ తీగలు సరిచేస్తుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి - farmer died due to current shock
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బాచేపల్లిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలు సరిచేస్తుండగా కరెంట్ షాక్తో మల్లేశం అనే రైతు మరణించాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని... ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని కుటుంబసభ్యులు కోరారు.
విద్యుత్ తీగలు సరిచేస్తుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి
ట్రాన్స్ఫార్మర్ వద్ద సమస్య ఉందని... మరమ్మతులు చేయాలని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు మండిపడ్డారు. రైతుల బాధలను అర్థంచేసుకుని బాధిత రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.