అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో ప్రాణహాని ఉందంటూ... ఓ రైతు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని రామాలయానికి చెందిన 32 ఎకరాల భూమిని గత 70 ఏళ్లుగా కౌలు చేసుకుంటూ... దేవాదాయ శాఖకు ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నట్లు బాధిత రైతు జనార్దన్ రెడ్డి కమిషన్‌కు వివరించాడు. ఆ భూమిపై ఎమ్మెల్యే కన్ను పడటం వల్ల... దేవాదాయశాఖ అధికారులతో కుమ్మకై తన కౌలు రద్దు చేయించారని జనార్దన్‌రెడ్డి ఆరోపించాడు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయిస్తే... తాను పండించిన ఈ ఏడాది పంటను సాగు చేసుకోవచ్చని... అందుకోసం దేవాదాయ శాఖకు రెండున్నర లక్షలు కౌలు చెల్లించాలని ఆదేశించిందన్నారు.
ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి: రైతు - complaint on mla bhupalreddy
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ రైతు హెచ్చార్సీని ఆశ్రయించాడు. తాను చేస్తున్న ఆక్రమాలకు వ్యతిరేకంగా పోలీసులు, కోర్టును ఆశ్రయించింనందుకు తనపై కక్ష పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారని కమిషన్ ఎదుట వాపోయాడు. ఎమ్మల్యే నుంచి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని వేడుకున్నాడు.
కోర్టు ఆదేశాల మేరకు తాను రెండున్నర లక్షలను రెండు విడతలుగా అధికారులకు అందజేశానని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు ఎమ్మెల్యే కక్ష పెంచుకున్నారని తెలిపాడు. తనపై దాడి చేసి... తాను పండించిన 110 క్వింటాల పత్తిని అక్రమంగా ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసులతో పాటు... సంగారెడ్డి జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఎమ్మెల్యే అనుచరుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు. వారి నుంచి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని కమిషన్‌ను వేడుకున్నారు.
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా తన పంటను ఎత్తుకెళ్లిన స్థానిక అధికార పార్టీ నాయకులపై... ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులపై చర్యలు తీసుకుకొని... న్యాయం చేయాలని బాధిత రైతు హెచ్చార్సీని కోరారు.