తెలంగాణ

telangana

ETV Bharat / state

అపోలో డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లో తప్పుడు నివేదికలు - False reports in Apollo Diagnostic Lab in Sangareddy district

ఓ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఇచ్చిన తప్పుడు రిపోర్టు ఆ కుటుంబాన్ని హడలెత్తించింది. తమ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్​లోని కార్పొరేటు ఆసుపత్రులకు పరుగులు పెట్టారు. ఊహకందని రీతిలో ఉన్న ఫలితాలు చూసి వైద్యులే నివ్వెర పోయారు. బాధితురాలిని పరీక్షించి.. రిపోర్టు తప్పు అని తేల్చడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

sangareddy Apollo Diagnostic Lab, False reports
అపోలో డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లో తప్పుడు నివేదికలు

By

Published : May 3, 2021, 3:09 PM IST

సంగారెడ్డిలోని అపోలో డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లో తప్పుడు నివేదికలు ఇచ్చారంటూ టెస్టింగ్‌ సెంటర్‌ ఎదుట రోగి బంధువులు ఆందోళన నిర్వహించారు. మైత్రి అనే మహిళ గతనెల 23న ఐఎల్​-6 పరీక్ష చేయించుకోగా 999 పాయింట్లు ఉన్నట్లు రిపోర్టు ఇచ్చారు. సాధరణంగా 7పాయింట్లకు మించకూడని ఐఎల్​-6 ఈస్థాయిలో ఉండే సరికి.... వెంటనే హైదరాబాద్‌లోని మరో ల్యాబ్‌లో పరీక్ష చేపించగా 1.5 ఉన్నట్లు వచ్చింది.

దీనిపై బాధితురాలి తండ్రి చక్రధర్ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు వెళ్లి వివరణ కోరగా.... తమకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రి దేవికి ఫిర్యాదు చేయగా.... అనుమతి లేకుండా నిర్వహిస్తున్న సెంటర్‌కు గతంలో 10వేల జరిమానా విధించామని, త్వరలో సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

అపోలో డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లో తప్పుడు నివేదికలు

ఇదీ చూడండి: నీ అరెస్టులకు.. కేసులకు భయపడే వ్యక్తిని కాదు: ఈటల

ABOUT THE AUTHOR

...view details