సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో పోలీసునంటూ చెలామణి అవుతున్న మంగలి సుభాశ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డుపై వాహనాలను నిలిపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కిషన్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు అతనిని వలపన్ని పట్టుకున్నట్లు ఎస్సై సందీప్ వెల్లడించారు.
నారాయణఖేడ్‌లో నకిలీ పోలీసు అరెస్టు - నకిలీ పోలీసు అరెస్టు తాజావార్తలు
పోలీసునంటూ బెదిరించి వాహనాదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని నారాయణఖేడ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.5800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సందీప్ వెల్లడించారు.
![నారాయణఖేడ్‌లో నకిలీ పోలీసు అరెస్టు Fake police Arrested by Narayanapeta polices](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7983488-603-7983488-1594461389713.jpg)
నారాయణఖేడ్‌లో నకిలీ పోలీసు అరెస్టు
నిందితుడు కామారెడ్డి జిల్లా తడ్కోల్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పట్టణ శివారులో వృద్ధులను టార్గెట్ చేసి వారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుని నుంచి రూ.5800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.