సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానురు గ్రామ పరిధిలో ఉన్న బీడీఎల్ పరిశ్రమలో ఓ పేలుడు పదార్థం బయటపడింది. పరిశ్రమలో ఆయుధ సామగ్రి పరీక్షలు నిర్వహిస్తుండగా మిస్ ఫైర్ అయ్యి ఈ ఘటన జరిగింది.
బీడీఎల్ పరిశ్రమలో మిస్ ఫైర్ అయిన పేలుడు పదార్థం - medak district latest news
బీడీఎల్ పరిశ్రమలో ఆయుధ సామగ్రి పరీక్షలు నిర్వహిస్తుండగా ఓ పేలుడు పదార్థం మిస్ పైర్ అయ్యి బయటపడింది. శివారులోని వ్యవసాయ పొలాల్లో పడటంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు భయాందోళనలకు గురయ్యారు.
![బీడీఎల్ పరిశ్రమలో మిస్ ఫైర్ అయిన పేలుడు పదార్థం explosive weapons misfired in bdl industry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9674382-974-9674382-1606396542721.jpg)
బీడీఎల్ పరిశ్రమలో మిస్ ఫైర్ అయిన పేలుడు పదార్థం
పేలుడు పదార్థం శివారులోని వ్యవసాయ పొలాల్లో పడింది. పొల్లాల్లో పనిచేస్తున్న రైతులపై నుంచి కొద్ది ఎత్తు దూసుకెళ్లడంతో వారంతా భయాందోళనలకి గురయ్యారు. పేలుడు పదార్థాన్ని వెతికేందుకు సీఐఎస్ఎఫ్ ఉద్యోగులు చాలాసేపు శ్రమించారు. కానీ ఈ ఘటనను బీడీఎల్ యాజమాన్యం అధికారికంగా ఎటువంటి ధ్రువీకరణించలేదు.
ఇదీ చదవండి:ఈనెల 28న హైదరాబాద్కు మోదీ... కొవాగ్జిన్ పురోగతి పరిశీలన