సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆబ్కారీ పోలీసులు నాటు సారా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లోని తండాల్లో పోలీసులు మెరుపు దాడులు జరిపారు. దాడుల్లో 150 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్టు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. విటు నాయక్ తండా, సజ్జారావు పేట తండా, అర్జున్ నాయక్ తండా, ఉప్పర్పల్లి తండాల్లో దాడులు నిర్వహించి ఐదుగురు సారా తయారీదార్లను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి జహీరాబాద్ కోర్టులో హజరు పరుస్తామన్నారు. ఎవరైనా లాక్డౌన్ ఆంక్షలు అతిక్రమించి సారా తయారు చేస్తే.. కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు.
నాటుసారా కేంద్రాలపై పోలీసుల దాడి - Excise Police Attacks On Gudumba settlements
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆబ్కారీ పోలీసులు నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. లాక్డౌన్ ఆంక్షలు అతిక్రమించి సారా తయారు చేస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
![నాటుసారా కేంద్రాలపై పోలీసుల దాడి Excise Police Attacks On Gudumba settlements](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7007969-655-7007969-1588261831819.jpg)
నాటుసారా కేంద్రాలపై పోలీసుల దాడి