అన్నదాతల హక్కులను కాలరాసేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ నూతన వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చిందని మాజీ మంత్రి గీతారెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఖాసింపూర్లో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ - sangareddy district news
సంగారెడ్డి జిల్లా ఖాసింపూర్లో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా మాజీ మంత్రి గీతారెడ్డి సంతకాల సేకరణ చేపట్టారు. అన్నదాతల హక్కులను కాలరాసేందుకే మోదీ సర్కార్ బిల్లులను తీసుకొచ్చిందని ఆరోపించారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
దేశానికి అన్నం పెట్టే రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తుందని అన్నారు. పార్లమెంట్లో బిల్లులకు అడ్డుపడిన కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసి బిల్లును అక్రమంగా ఆమోదించుకున్నారని విమర్శలు గుప్పించారు. సంతకాల సేకరణలో మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, జహీరాబాద్, మొగుడంపల్లీ మండలాల కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి సీఎం సతీమణి స్పందన.. పేద కుటుంబానికి ఆర్థిక సాయం