సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రమిక వాడలోని థర్మల్ సిస్టం పరిశ్రమలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో పరిశ్రమల యాజమాన్య సంఘం ఓటరు చైతన్య అవగాహన సదస్సు నిర్వహించారు. బొల్లారం మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
'ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి' - latest news on voter awareness programme at bollaram
బొల్లారంలోని పారిశ్రామిక వాడలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య సదస్సు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి'
పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వంద శాతం ఓట్లు వినియోగించుకునేలా చూడాలని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నారు. సమర్థవంతమైన పాలన అందించే నేతలను ఎన్నుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్నగర్ కార్పొరేషన్