తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలి'

ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలు బయటికి వెళ్లిన సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పటాన్​చెరు డీఎస్పీ రాజేశ్వర్​రెడ్డి తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

'Every student should have a goal' at sangareddy
'ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలి'

By

Published : Dec 5, 2019, 4:26 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి సాంస్కృతిక ఉత్సవాలకు డీఎస్పీ రాజేశ్వర్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మన దేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశమని, మీరు బాగా చదువుకుని అందులో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా డీఎస్పీ సూచించారు. గతంలో విద్యార్థులకు సౌకర్యాలు ఉండేవి కాదని, రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుందని దీనిని వినియోగించుకుని అభివృద్ధికిలోకి రావాలన్నారు. ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలని, దాని కృషికై ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం బహుదూర్ పుర, సికింద్రాబాద్ గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

'ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలి'

ఇదీ చూడండి : 'మద్యం నియంత్రణ కోసం కాంగ్రెస్ పోరుబాట'

For All Latest Updates

TAGGED:

fest

ABOUT THE AUTHOR

...view details