సంగారెడ్డి జిల్లాలో ఈస్టర్ పండుగను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఎవరి ఇళ్లలో వారే ప్రార్థనలు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో సంగారెడ్డి రక్షణ సైన్య ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో వలస కూలీలకు, పేదలకు అన్నదానం చేశారు. ప్రజలందరూ కరోనా మహమ్మారి నుంచి త్వరగా బయటపడాలని ఆ భగవంతుడ్ని ప్రార్థించినట్లు మందిరం నిర్వహకులు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన కోరారు.
ఈస్టర్ సందర్భంగా సంగారెడ్డిలో పేదలకు అన్నదానం - ప్రజలంతా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి : చర్చి పాస్టర్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ చర్చిలో ఈస్టర్ వేడుకలు నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ప్రజలంతా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి : చర్చి పాస్టర్
TAGGED:
ESTER FESTIVAL IN SANGAREDDY