పంటకు మద్దతు ధర కల్పించేందుకే ధాన్యం కొనుగులు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. రైతులెవరూ దళారులను ఆశ్రయించొద్దని, పంటను నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు. జిల్లాలోని కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో సహకార సంఘం, ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే - రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఎలాంటి సమస్యలు లేకుండా మద్దతు ధరకు అమ్ముకునేందుకు ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు.
నారాయణ్‌ఖేడ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రైతుల సౌకర్యం కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ రాంసింగ్, మండల జడ్పీటీసీ నర్సింహా రెడ్డి, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, సొసైటీ ఛైర్మెన్ కృష్ణ గౌడ్, ఎంపీటీసీ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:లాక్డౌన్ వేళ.. డిజిటల్ లావాదేవీల హవా