లాక్‌డౌన్ సమయంలో రైతులు ఇబ్బంది పడకూడదనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ధాన్యం కొనుగోలు ఆయన ప్రారంభించారు. పండిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో రైతులు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులో ఉందని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి : మహిపాల్‌రెడ్డి - Patancheru MLA Mahipal Reddy Latest news
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి... లబ్ధి పొందాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పీఏసీఎస్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం