సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ సమీపంలోని జెఎన్టీయూలో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు రాజ్ కుమార్, ఈశ్వర్ ద్విచక్రవాహనంపై పటాన్చెరు వైపు వెళ్తున్నారు. అదే సమయంలో రుద్రారం సమీపంలో గుర్తు తెలియని వాహనం వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజ్ కూమార్ అక్కడికక్కడే మృతి చెందగా... ఈశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గమనించిన స్థానికులు ఈశ్వర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి బీరంగూడలోని పనేషియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి - గుర్తుతెలియని వాహనం ఢీకొని సంగారెడ్డిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా... మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి