Employee Misbehaved with Female Students: సంగారెడ్డి జిల్లా సల్వాది ఎంఎన్ఆర్ కళాశాలలో ఓ ఉద్యోగి తీరుపై విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. గత కొంత కాలంగా తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. గత కొన్ని రోజులుగా కళాశాలలో పనిచేసే సదరు ఉద్యోగి.. విద్యార్థినులు ఉండే గదులు, బాత్రూముల్లోకి చెకింగ్ చేస్తానంటూ ఇష్టానుసారంగా వస్తున్నాడని వాపోయారు.
సంగారెడ్డి జిల్లాలో కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన.. ఎందుకంటే.. - telangana news
Employee Misbehaved with Female Students: సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్ కళాశాలలో ఒక ఉద్యోగి తమ పట్ల కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థునులు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు చెప్పినా ఆ ఉద్యోగి విద్యార్థునులు ఉండే గదులు, బాత్రూంల్లోకి ఇష్టానుసారంగా వస్తున్నాడని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లాలో కళాశాల ఎదుట విద్యార్థినుల ఆందోళన..!
విద్యార్థినులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా మంగళవారం రాత్రి మళ్లీ గదుల్లో చెకింగ్ అంటూ వచ్చాడని ఆరోపించారు. అలా వస్తుంటే ఇబ్బందిగా ఉందని యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా.. పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే అతన్ని కళాశాల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: