సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరం బండ, అమీన్పూర్ మండలం నర్రెగూడెం గ్రామాల్లో జేఎన్ఎన్యూ ఆర్ఎం, వాంబే పథకంలో భాగంగా నివాస సముదాయాలు నిర్మించారు. వీటిల్లో నివసించేందుకు గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి , చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో ఉన్నవారు అర్జీ పెట్టుకున్నారు. వీరికి ఈ నెల 24 తేదీలోపు తమ అంగీకార పత్రం సమర్పించాలని జిల్లా పాలనాధికారి హనుమంతరావు పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు
రామేశ్వరంబండ, నర్రెగూడెం ప్రాంతాల్లో నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే గృహాలను అర్జీదారులకు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.