ప్రాదేశిక ఎన్నికలు సమీపిస్తుండటం వల్ల అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో జరిగే మూడో విడత ప్రాదేశిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జహీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన, నియమావళి అమలుపై శిక్షకులు అవగాహన కల్పించారు. మూడో విడత ఎన్నికలు జరిగే జహీరాబాద్, మొగుడంపల్లీ, ఝరాసంగం, న్యాల్కల్, కోహిర్, రాయికోడ్, మునిపల్లి మండలాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
జహీరాబాద్లో రిటర్నింగ్ అధికారులకు శిక్షణ - election-training
ప్రాదేశిక ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లను వేగంగా చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో రిటర్నింగ్ అధికారులకు శిక్షకులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
![జహీరాబాద్లో రిటర్నింగ్ అధికారులకు శిక్షణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3093440-thumbnail-3x2-trainingjpg.jpg)
జహీరాబాద్లో రిటర్నింగ్ అధికారులకు శిక్షణ