ఈస్టర్ వేడుకల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మట్టల ఆదివారం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. జహీరాబాద్లోని బాగారెడ్డిపల్లి చర్చిలో వనిత స్కూల్ విద్యార్థులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈస్టర్ వేడుకల్లో భాగంగా మట్టల ప్రదర్శన - జహీరాబాద్లో మట్టల ప్రదర్శన
అప్పుడే ఈస్టర్ సంబురాలు మొదలయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మట్టల ఆదివారం నిర్వహించారు. బాగారెడ్డిపల్లి చర్చి వద్ద వనిత పాఠశాల విద్యార్థులతో ప్రదర్శన చేపట్టారు.
జహీరాబాద్లో ఈస్టర్ సంబురాలు
అనంతరం కాలనీలో మట్టలతో ప్రదర్శన చేపట్టారు. యేసు ప్రభువు గీతాలు ఆలపిస్తూ ఉత్సాహంగా ప్రదర్శన కొనసాగించారు. ఈ వేడుకల్లో రెవరెండ్ రాజారావు, క్రిస్టియన్ యూత్ నాయకులు పాల్గొన్నారు.