సంగారెడ్డి జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్లలోంచి పరుగులు తీసిన ప్రజలు - Earthquakes in kohir mandal

13:17 January 05
Earthquakes in Sangareddy: కోహీర్ మండలంలో భూప్రకంపనలు
Earthquakes in Sangareddy: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని మనియార్‌పల్లి, బిలాల్‌పూర్, గొట్టిగార్‌పల్లి గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బిలాల్‌పూర్, మనియార్‌పల్లి, గొడిగార్పల్లి గ్రామాల్లో 12 గంటల 40 నిమిషాల సమయంలో పెద్ద శబ్దంతో భూప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. సుమారు ఐదు నుంచి పది సెకన్ల పాటు భూమి కంపించిందని గ్రామస్తులు తెలిపారు. ఒక్కసారిగా రైలు కూత లాంటి శబ్దం వినిపించడంతో ఆందోళనకు గురై బయటకు వచ్చి చూశామని ప్రజలు చెప్పారు.