తెలంగాణ

telangana

ETV Bharat / state

'బాధ్యతగా ఉండండి.. చెత్తను రోడ్లుపై పడెయ్యకండి' - సంగారెడ్డిలో డంపింగ్​ యార్డుల ప్రారంభం

సంగారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీల్లో నిర్మించిన డంపింగ్​ యార్డులు, వైకుంఠధామాలను ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి ప్రారంభించారు. ఇకపై ప్రజలెవరూ చెత్తను రోడ్డుపై వేయకూడదని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ఆయన సూచించారు.

Dump yards inaugurated by mla mahipal reddy in Sangareddy
'బాధ్యతగా ఉండండి.. చెత్తను రోడ్లుపై పడెయ్యకండి'

By

Published : Jul 15, 2020, 1:18 PM IST

జూలై నెల 15వ తేదీ నుంచి గ్రామాల్లో బహిరంగంగా చెత్త వేయకూడదని, ప్రతీ ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి ఇవ్వాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్మించిన డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను ఆయన ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగంగా చెత్త వేస్తే ఇక నుంచి జరిమానాలు విధించడం జరుగుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఆయన సూచించారు. అంత్యక్రియల కోసం ఎవరికీ ఇబ్బంది కలగకూడదు అన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలను నిర్మించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని 55 గ్రామపంచాయతీలో వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్​ల నిర్మాణం పూర్తైందని ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చదవండి :కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details