తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదవశాత్తు కారు దగ్ధం... ఇద్దరికి స్వల్ప గాయాలు - short circuit latest news

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పరిధిలో ప్రమాదవ శాత్తు కారు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది.

షార్ట్ సర్క్యూట్​తో రహదారిపై కారు దగ్ధం
షార్ట్ సర్క్యూట్​తో రహదారిపై కారు దగ్ధం

By

Published : May 27, 2020, 5:55 PM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామ శివారులో కారు దగ్ధమైంది. బుదేరా గ్రామానికి చెందిన ఎంపీటీసీ ప్రభాకర్ కుమారుడు వ్యక్తిగత పని కోసం సంగారెడ్డికి వెళ్తుండగా కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కావటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులోని ఇద్దరు వ్యక్తులు చిన్న గాయాలతో బయటపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న సంగారెడ్డి పురపాలిక సిబ్బంది వాటర్ ట్యాంక్​తో మంటలను అదుపు చేశారు.

షార్ట్ సర్క్యూట్​తో రహదారిపై కారు దగ్ధం

ABOUT THE AUTHOR

...view details