సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రోడ్డు షో నిర్వహించారు. భాజపా అభ్యర్థి ఆశిశ్ గౌడ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. మంత్రి కేటీఆర్ అరాచకం కావాలా.. అభివృద్ధి కావాలని అడుగుతున్నారని.. కానీ లింగంపల్లి నుంచి పటాన్చెరు వరకు ఎంఎంటీఎస్ పొడిగిస్తామని అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికే రాలేదన్నారు.
ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు: రఘునందన్ రావు - dubbaka mla raghunandan rao road show in patancheru
అభివృద్ధిపై ప్రశ్నిస్తే అధికార పార్టీవారు దాడులకు దిగుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లో భాజపా అభ్యర్థి ఆశిశ్ గౌడ్‌కు మద్దతుగా రోడ్డు షో నిర్వహించారు.
![ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు: రఘునందన్ రావు dubbaka mla raghunandan rao campaign in ghmc elections in patancheru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9642693-thumbnail-3x2-bjp.jpg)
ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు: రఘునందన్ రావు
పటాన్చెరు నుంచి చిన్న వాగు మీదుగా బాహ్యవలయ రహదారి వరకు నిర్మించాలనుకున్న రహదారి నిర్మించలేదన్నారు. సిద్దిపేటలో కోమటిచెరువుకు జరిగిన అభివృద్ధి.. పటాన్చెరులో సాకిచెరువుకు ఎందుకు జరగలేదన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్నారు. ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలో ఉండగా భైంసాలో మతఘర్షణలు రాలేదా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:ఆరేళ్లలో భాజపా తెలంగాణకు చేసింది సున్నా : కేటీఆర్