తెలంగాణ

telangana

ETV Bharat / state

విత్తనాల కోసం బారులు తీరిన రైతులు - సోయా విత్తనాల పంపిణీ

సోయా విత్తనాల పంపిణీ చేపట్టడం వల్ల.. సంగారెడ్డి జిల్లా తడ్కల్​ సమీప గ్రామాల రైతులు భారీగా తరలివచ్చారు. ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్ల విత్తనాలు దొరుకుతాయో లేదో అని రైతులు బారులు తీరారు.

Distribution of soybean seeds in Tadkal village
విత్తనాల కోసం బారులు తీరిన రైతులు

By

Published : Jun 15, 2020, 9:13 PM IST

సంగారెడ్డి జిల్లా కంగ్టి, తడ్కల్​ల​లో సోయా విత్తనాల పంపిణీ చేపట్టడం వల్ల రైతులు భారీగా తరలివచ్చి బారులు తీరారు. అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్ల విత్తనాలు దొరుకుతాయో లేదో అని రైతులు బారులు తీరారు.

భౌతిక దూరం.. బహుదూరం

వర్షాలు పడటం, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం వల్ల విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అరకొరగా విత్తనాలు అందుబాటులోకి రావడం కారణంగా రైతులు ఒక్కసారిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భౌతిక దూరం పాటించకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను క్రమంలో నిలబెట్టారు.

ఇదీ చూడండి:మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్‌ గుప్తాకు పాజిటివ్‌

ABOUT THE AUTHOR

...view details